![]() |
| Writer |
Written - ranklin Jacob
Produced - Pa. Ranjith, Abhayanand Singh, Piiyush Singh, Aditi Anand
Starring - Dilipan, Iniya, Samuthirakani
Cinematography - Pratheep Kaliraja
Edited - Manigandan Sivakumar
Music - Govind Vasantha
Release - 27 May 2022
Running time - 147 minutes
Writer Telugu Movie: సముద్రఖని నటించిన తమిళ సినిమా 'రైటర్'ను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ అయ్యింది. ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ: రంగరాజు (సముద్రఖని) అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో రైటర్. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు ఒక యూనియన్ ఉండాలని పోరాటం చేస్తున్నాడు. ఆ విషయమై కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఇది నచ్చని పై అధికారి అతడిని విశాఖకు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. దేవ కుమార్ (హరీష్ కృష్ణన్) అనే పీహెడ్‌డి స్టూడెంట్‌ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు కల్యాణ మండపంలో, లాడ్జిలో ఉంచుతారు. ఎందుకలా చేశాడు? విశాఖలో అడుగుపెట్టే వరకూ తనకు ఎటువంటి పరిచయం లేని దేవ కుమార్‌ను తప్పించాలని రంగరాజు ఎందుకు ప్రయత్నించాడు? ఎందుకు జైలుకు వెళ్ళాడు? అసలు, ఏం జరిగింది? కేసు ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'రైటర్' సినిమా నిర్మాతల్లో రజనీకాంత్ 'కబాలి', 'కాలా' చిత్రాల దర్శకుడు పా. రంజిత్ ఒకరు. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తీసిన సినిమాల్లో వర్ణ వివక్ష (కాస్ట్ ఫీలింగ్) కారణంగా ఓ వర్గం ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు, ఒక వర్గానికి జరిగిన అన్యాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. 'రైటర్'లో పోలీస్ వ్యవస్థలో వర్ణ వివక్ష గురించి అంతర్లీనంగా చూపించారు. అయితే, అంతకు మించి ఎమోషన్ ఉంది. సముద్రఖని అద్భుత అభినయం ఉంది.
ఒక కథగా, సినిమాగా 'రైటర్'ను చూస్తే... 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'నాంది' ఛాయలు కొన్ని కనిపిస్తాయి. 'నాంది'లో అన్యాయంగా ఒక యువకుడిని పోలీసులు కేసులో ఇరికిస్తే... ఆ యువకుడు పడే మనోవేదనను హృదయానికి హత్తుకునేలా చూపించారు. 'రైటర్'లో యువకుడి మనోవేదన కంటే... ఒక కుర్రాడు తన వల్ల అన్యాయంగా కేసులో ఇరుకున్నాడని పశ్చాత్తాపంతో బాధపడే ఒక పోలీస్ మనోవేదనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు.
'రైటర్'లో సముద్రఖని, దేవ కుమార్ పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. అందువల్ల, సినిమా ప్రారంభమైన గంట వరకు చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లిన తర్వాత కూడా వేగం పెరగలేదు. కానీ, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. సముద్రఖని కుటుంబ నేపథ్యం కథకు అవసరం లేదేమో అనిపిస్తుంది. అలాగే, దేవకుమార్ కుటుంబ నేపథ్య సన్నివేశాలు కూడా! సినిమాలో చాలా అంశాలను ప్రస్తావించారు. కానీ, లోతుగా చర్చించకుండా పైపైన చూపిస్తూ వెళ్ళారు.
రంగరాజుగా సముద్రఖని జీవించారు. పాత్రకు ప్రాణం పోశారు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో కొత్త సముద్రఖని కనిపిస్తారు. హరికృష్ణన్, ఇతర తారాగణం - సినిమాకు పర్ఫెక్ట్ కాస్టింగ్ కుదిరింది. అయితే, సముద్రఖని వచ్చినప్పుడు ఇతరులపై దృష్టి పడదు. సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు కూడా ఆయన ఒక్కరే కావడం అందుకు కారణం.






0 Reviews